నటనతో తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితురాలైన నటి వరలక్ష్మి శరత్ కుమార్ తన కెరీర్‌లో మరో కీలక అడుగు వేశారు. కేవలం నటనకే పరిమితం కాకుండా, దర్శకనిర్మాతగా కొత్త అవతారం ఎత్తారు. తన సోదరి పూజా శరత్ కుమార్‌తో కలిసి ‘దోస డైరీస్’ పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ బ్యానర్‌పై తొలి చిత్రంగా ‘సరస్వతి’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు..
ఈ చిత్రానికి వరలక్ష్మి దర్శకత్వం వహించడమే కాకుండా, ప్రధాన పాత్రలోనూ నటిస్తుండటం విశేషం. ఇది ఒక హై-ఆక్టేన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకోనుంది. విడుదల చేసిన టైటిల్ పోస్టర్‌లో ‘సరస్వతి’ పేరులోని ‘తి’ అక్షరాన్ని ఎరుపు రంగులో హైలైట్ చేయడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు..!!