స్టార్ హీరోయిన్ త్రిష తన కొడుకు చనిపోయాడని ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం తాను షాక్‌లో ఉన్నానని ఈ బాధ నుంచి తన ఫ్యామిలీ బయటపడేందుకు సమయం పడుతుందని చెప్పింది. ఇక్కడ జోర్రో అంటే త్రిష పెంపుడు కుక్క. అది అంటే తనకు ఎంత ఇష్టమో తన పోస్టు చూస్తే అర్థమవుతోంది. ప్రస్తుతం త్రిష చేసిన ఈ పోస్టు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది..
త్రిష సోషల్ మీడియాలో ఈ విషయం ట్వీట్ చేస్తూ నా ప్రియమైన కొడుకు జోర్రో మరణించాడు. ఈ క్రిస్మస్ రోజు తెల్లవారుజామున చనిపోయాడు. నా గురించి బాగా తెలిసిన వాళ్లకు జొర్రో నాకు ఎంత ముఖ్యం అనేది బాగా తెలుసు. నేను నా ఫ్యామిలీ ఇప్పుడు చాలా బాధలో ఉన్నాము. ఈ బాధ నుంచి బయటపడడానికి సమయం కావాలి అంటూ ట్వీట్ చేసింది. జొర్రోకు సంబంధించిన ఫొటోలు, అంత్యక్రియలు పూర్తి చేసిన ఫొటోలను షేర్ చేసింది..!!