పెళ్లి తర్వాత కూడా రకుల్ వరుస సినిమాలకు కమిట్ అవుతూ బాలీవుడ్ ఇండస్ట్రీలోనే బిజీగా ఉన్నారు ఇక ఈమెకు ఏ మాత్రం విరామం దొరికిన పెద్ద ఎత్తున వర్కౌట్స్ చేస్తూ జిమ్ లోనే కనబడుతూ ఉంటారు. అయితే గత కొద్ది రోజుల క్రితం ఈమె బరువులు అధికంగా ఎత్తడంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్న విషయం మనకు తెలిసింది అయితే ఈ గాయం నుంచి బయటపడిన తర్వాత రకుల్ తిరిగి తన సినిమా పనులలో ఎంతో బిజీగా మారిపోయారు.
ఈ క్రమంలోనే రకుల్ తన గాయం గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. గాయపడిన తర్వాత నా శరీరంపై గౌరవం పెరిగింది. కెరీర్‌పై దృష్టిపెట్టడం నేర్చుకున్నాను. ఏదీ అతిగా చేయకూడదని అర్థమైంది. ఇక నేను ఎవరికైనా సలహా ఇవ్వాలి అనుకుంటే ఈ ఒక్కటి మాత్రమే ఇస్తాను. మీ శరీరం మాట వినడం. పరిమితికి మించి వ్యాయామం చేయొద్దునే సలహా మాత్రమే తాను ఇస్తానని రకుల్ వెల్లడించారు. తనుకు జరిగిన ఈ గాయం నుంచి కోలుకొని తిరిగి సినిమా సెట్ లోకి అడుగుపెట్టడంతో తనకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు..!!