ప్రముఖ నటి పూర్ణ సీమటపాకాయ్, అవును, అఖండ లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. అంతేకాకుండా రెండో ఇన్నింగ్స్‌లో ఓ ప్రముఖ టీవీ ఛానల్‌లో డ్యాన్స్‌షోలో జడ్జిగానూ వ్యవహరిస్తూ ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇల్లాలు కాబోతోంది. దుబాయ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తను వివాహం చేసుకోబోతుంది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలియజేసింది. షానిద్ అసిఫ్ అలీని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. పూర్ణ వివాహం చేసుకోబోతున్న షానిద్.. దుబాయ్‌లో బిజినెస్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు.
Actress Poorna announces her engagement!
“నా కుటుంబ సభ్యుల దీవెనలతో నా జీవితంలో మరో ముందడుగు వేయనున్నా. షానిద్ అసిఫ్ అలీతో వివాహం ఇప్పుడు అధికారికమైంది.” అని పూర్ణ తన ఇన్‌స్టాలో పేర్కొంది. పూర్ణ 2004లోనే చిత్రసీమలో అరంగేట్రం చేసింది. మలయాళ సినిమాల ద్వారా బాగా పాపులారిటీని సంపాదించిన ఈ ముద్దుగుమ్మ శ్రీ మహాలక్ష్మీ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అనంతరం సీమటపాకాయ్, అవును, అవును2, రాజుగారి గది, అఖండ, దృశ్యం2 లాంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది..