in

actress Nithya Menen turns producer!

క్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జాతీయ అవార్డు గ్రహీత, నటి నిత్యా మీనన్ నిర్మాతగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. ‘కీయురి ప్రొడక్షన్స్’ పేరుతో తన సొంత నిర్మాణ సంస్థను మంగళవారం ప్రకటించారు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా వెల్లడిస్తూ, ప్రొడక్షన్ హౌస్ లోగో వీడియోను పంచుకున్నారు..

సినిమాలు తీయడమంటే కేవలం కథలు చెప్పడం మాత్రమే కాదని, మనుషులను లోతైన స్థాయిలో స్పృశించడం అని ఆమె పేర్కొన్నారు. “నటన ప్రారంభించిన తొలిరోజు నుంచి నా ఉద్దేశం ఇదే. ఇప్పుడు నిర్మాతగా కూడా అదే ఉద్దేశంతో కొనసాగుతాను. నాలోని సృజనాత్మక ప్రక్రియ ద్వారా, చూసేవారిలో ఒక పరివర్తన తీసుకురావడమే నా లక్ష్యం” అని తన పోస్టులో వివరించారు. భూమి గుహల నుంచి పుట్టి, రాతితో చెక్కబడిన, కాంతిని ప్రేమించే రూపం లేనిదే ‘కీయురి’ అని ఆమె వీడియోలో పేర్కొన్నారు..!!

Priyamani in Indo-US Film on an Immigrant Family!

ss rajamouli reveals about his desire globally!