in

Actress Keerthy Suresh finally responds on marriage rumors!

కీర్తికి పెళ్ల అంట, వరుడు అతడే అంటూ తెగ వార్తలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఇటీవల తన ఫ్రెండ్ తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేయడంతో ఈ వార్తలు మరీ ఊపందుకున్నాయి. అతను కీర్తి బాయ్ ఫ్రెండ్ అని అతనితోనే పెళ్లి అంటూ గాసిప్స్ వచ్చాయి. ఈ వార్తలు రోజు రోజుకీ పెరుగుతుండటంతో తాజాగా కీర్తి స్పందించింది. తన పెళ్లి గురించి తానే చెబుతానని ఆమె చెప్పడం విశేషం.

ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్ తో కీర్తి మామన్నన్ అనే సినిమాలో నటించింది. ఈ మూవీ ఆడియో ఫంక్షన్ నిర్వహించగా, అక్కడ మీడియా నుంచి ఆమెకు ఈ ప్రశ్న ఎదురైంది. మీ పెళ్లి ఎప్పుడు అని అడిగేశారు. దీంతో ఆమె క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే తాను తన పెళ్లి విషయం గురించి క్లారిటీ ఇచ్చానని, మళ్లీ అదే విషయం పదే పదే ఎందుకు అడుగుతున్నారని ఆమె ప్రశ్నించారు. నిజంగా తాను పెళ్లి చేసుకుంటే అందరికీ చెబుతానని, ఇన్ని సార్లు అడగాల్సిన అవసరం లేదని ఆమె చెప్పడం విశేషం..!!

Naga Chaitanya turns into a fishing boat driver!

udaya bhanu makes her re entry in tollywood!