తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియోతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది జయసుధ. ప్రముఖ ఛానెల్ లో ప్రసారం కానున్న ‘జానకి కలగనలేదు’ అనే సీరియల్ బృందానికి విషెస్ చెబుతూ ఓ సందేశం విడుదల చేసింది. శోభన్ బాబుతో కలిసి నటించిన ‘జానకి కలగనలేదు.. రాముడి సతి కాగలనని ఏనాడు’ అనే పాట అప్పట్లో మంచి సక్సెస్ అయిందని గుర్తుచేసుకున్నారు. ఇళయరాజా సంగీతం అందించిన ఈ పాట అప్పట్లో ప్రభంజనం సృష్టించిందని చెప్పుకొచ్చారు.
actress Jayasudha’s Latest Look Shocks All!
తాజా వీడియోలో ఆరెంజ్ కలర్ నెక్ టీషర్ట్ ధరించిన జయసుధ నెరిసిన జుట్టుతో కనిపించారు. ముఖంలో మునుపటి కళ లేదు. పూర్తిగా పాలిపోయినట్లుగా కనిపిస్తోంది. దీంతో సహజనటికి అనారోగ్య సమస్యలేవైనా ఉన్నాయా లేదా షూటింగ్ లేనందు వల్లే ఇంట్లో ఇలా నార్మల్ లుక్‌తో ఉన్నారా అన్న విషయం అర్థం కాక ఫ్యాన్స్ గందరగోళంలో పడిపోయారు. కాగా జయసుధగా ప్రేక్షకుల మదిలో గూడుకట్టుకున్న సహజనటి అసలు పేరు సుజాత