హిందీ సిరీయల్ నటి హీనా ఖాన్ చాలా మందికి పరిచయం ఉండేఉంటుంది. ఆమె నటించిన సీరియల్స్ తెలుగులోనూ డబ్ అయ్యాయి. రీసెంట్ గా బిగ్ బాస్ కి కూడా వెళ్లి వచ్చారు. కాగా..ఆమె రీసెంట్ గా క్యాన్సర్ బారిన పడ్డారు. తనకు బ్రెస్ట్ క్యాన్సర్ సోకిందని నటి హీనా ఖాన్ వెల్లడించారు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించాడు..
తాను వ్యాధి మూడో దశలో ఉన్నానని హీనా పేర్కొంది. నేను ఖచ్చితంగా ఈ వ్యాధి నుండి బయటపడతాను. చికిత్స ప్రారంభమైంది. ఈ వ్యాధి నుండి బయటపడటానికి నేను చేయగలిగినదంతా చేయడానికి, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రతి ఒక్కరూ తన కోసం ప్రార్థించాలని హీనా పోస్ట్‌లో రాశారు. నటి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ అభిమానులు , స్నేహితులు పోస్ట్ క్రింద కామెంట్స్ పెట్టారు..!!