in

a secret bond between sreeleela and rashmika mandanna!

శ్రీలీల పెళ్లి సందడి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో శ్రీలీలకి – రష్మికకి ఉన్న లింక్ ఏమిటో, అది ఎప్పటినుంచో తెలుసా అని అనేక వార్తలు వస్తున్నాయి. ఇంతకీ రష్మిక, శ్రీలీల మధ్య ఉన్న లింక్ ఏమిటో తెలుసుకుందాం. రష్మిక మందన్న ప్రస్తుతం ఎంత బిజీగా ఉందో మన అందరికీ తెలిసిందే. చలో సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి బ్లాక్ బస్టర్ హిట్ ని సంపాదించుకొని.. ఆ తర్వాత గీతగోవిందంతో ఆమె కంటూ ఒక రేంజ్ ని తెచ్చుకుంది రష్మిక మందన్న. అయితే రష్మిక చేసిన మొదటి సినిమా తెలుగులో చలో సినిమాని మనందరికీ తెలిసిందే..

అయితే ఈ సినిమాలో మొదటిగా రష్మిక ని హీరోయిన్గా అనుకోలేదంట. శ్రీలీల ని ఆ సినిమాలో హీరోయిన్ గా తీసుకుందామని అనుకున్నారట. ఎగ్జామ్స్ ఉన్నాయని, అందుకని ఆ సినిమాకి డేట్స్ ఇవ్వలేనని చెప్పిందంట. దానితో ఆ ఆఫర్ ఈ కన్నడ బ్యూటీ రష్మిక అందుకుంది. అలా రష్మిక , శ్రీలీల మధ్య అక్కడ నుండే లింకు మొదలైంది. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలైనా పుష్ప, పుష్ప 2, అనిమల్ 2..ఇలా అన్నిట్లో కూడా శ్రీలీలే ఉండునేమో అని నెటిజనులు అనుకుంటున్నారు. ఏదైనా ఇద్దరూ అదృష్ట జాతకురాళ్లే.. అందుకే దేవుడు వాళ్ళిద్దరికీ ఉన్న లింకుతో ఎవరికి ఏది ఎంత వరకు అవకాశం ఉందొ అందులో సక్సెస్ వచ్చిందని మరికొందరు అనుకుంటున్నారు..!!

star heroine alia bhatt in mahesh babu – rajamouli film?

anupama: Romance is not an easy thing to do Infront of everyone