
విజయ ప్రొడక్షన్స్ వారు తెలుగు లో నిర్మించిన “షావుకార్” సినిమా ని తమిళ్ లో “ఇంగ వీటు పెన్ ” పేరు తో రీమేక్ చేసారు. ఆ సినిమా లో హీరోయిన్ పాత్ర కోసం నీరజా గారిని ఎంపిక చేసారు, తన ఎంపిక పట్ల SV రంగ రావు గారు అసంతృప్తి చూపించారు ఆ పాత్ర కి తాను కరెక్ట్ కాదని తన బదులు వేరే వారిని ఎంపిక చేయాలనీ ప్రొడ్యూసర్ బి. నాగి రెడ్డి గారిని కోరారు SVR గారు , చేసేది ఏమి లేక నాగి రెడ్డి ఆరోజు షూట్ కాన్సల్ చేసారు . నెక్స్ట్ డే నాగి రెడ్డి గారు నీరజా గారికి కాల్ చేసి షూటింగ్ స్పాట్ కి రమన్నారు, తీరా అక్కడ చూస్తే నీరజా గారిని రీప్లేస్ చేయమని కోరిన SVR గారిని రీప్లేస్ చేసి S.V. సుబ్బయ్య గారిని పెట్టుకున్నారు నాగి రెడ్డి గారు. తరువాత తన యాక్టింగ్ని మెచ్చి నాగి రెడ్డి గారి అన్నయ్య BN రెడ్డి గారు నీరజా గారికి తెలుగు ఫిలిం “రంగుల రాట్నం ” మూవీ లో ఛాన్స్ ఇచ్చి తన పేరు ని నిర్మల గ మార్చారు . విజయ ప్రొడక్షన్స్ వారు తన మీదుంచిన నమ్మకంతో వారికీ కృతజ్ఞత భావం గ తనకు పెట్టిన నిర్మల పేరు కి ప్రొడక్షన్ హౌస్ నేమ్ విజయ పేరు ని తన ఫస్ట్ నేమ్ గ పెట్టుకొని విజయ నిర్మల గ పూర్తి గ మార్చుకొని ఆ రోజు నుండి అదే పేరు తో మనందరికీ గుర్తుండిపోయారు .

