in

A RARE BOND BETWEEN N.T.R AND DURGA KALAMANDIR!

నందమూరి తారక రామ రావు గారికి, విజయవాడ లోని దుర్గా కళామందిర్ కి ఉన్న అనుబంధం విడదీయరానిది. యెన్.టి.ఆర్ నటించిన 62 చిత్రాలు ఈ ధియేటర్ లోనే విడుదల అయ్యాయి, ప్రతి సంవత్సరం యెన్.టి.ఆర్. నటించిన కనీసం ఒక్క సినిమా అయినా 100 డేస్ ఆడేది. యెన్.టి.ఆర్. నట జీవితానికి అంకురార్పణ జరిగింది కూడా ఈ ధియేటర్లోనే. 1947 ఏప్రిల్ నెలలో డిగ్రీ ఎగ్జామ్స్ పూర్తి చేసిన యెన్.టి.ఆర్. మొట్ట మొదటి సారిగా డైరెక్టర్ ఎల్ .వి. ప్రసాద్ గారిని కలుసుకున్నది దుర్గా కళా మందిర్ లోనే, తాను నిర్మించ బోయే కొత్త చిత్రం కోసం నటి, నటుల వేటలో ఉన్న ఎల్.వి.ప్రసాద్ గారు దుర్గా కళా మందిర్ లో “రైతు బిడ్డ” సినిమా చూస్తుండగా, రాత్రి పదకొండు గంటలకు యెన్.టి.ఆర్. తన స్నేహితుడు సుబ్రహ్మణ్యం తీసుకొని వెళ్లగా, ఎల్.వి.ప్రసాద్ గారిని కలిశారు. యెన్.టి.ఆర్. ని చూసిన ఎల్.వి.ప్రసాద్ బాగున్నావు, మే 21 వ తారీకు మద్రాసుకు వస్తే స్క్రీన్ టెస్ట్ చేస్తాము అని చెప్పారు..

ఆ తరువాత మద్రాస్ వెళ్లిన యెన్.టి.ఆర్ కి మేక్ అప్ టెస్ట్ చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి చిత్ర నిర్మాణం ప్రారంభించగానే కబురు చేస్తామని చెప్పారట ప్రసాద్ గారు. తాను ముందుగా అనుకున్న సినిమా నిర్మాణం ఆలస్యం కావటం తో అనుకోకుండా ఎల్.వి.ప్రసాద్ గారి డైరెక్షన్ లో నిర్మితం అవుతున్న “మన దేశం ” చిత్రం లో పోలీస్ ఆఫీసర్ రోల్ తో యెన్.టి.ఆర్. సినీ జీవితం ప్రారంభం అయింది. ఆ విధం గ యెన్.టి.ఆర్. సినీ జీవితం దుర్గా కళామందిర్ వేదికగా ప్రారంభం కావటమే కాకుండా అయన నటించిన అత్యధిక చిత్రాలు దుర్గా కళామందిర్లోనే రిలీజ్ అవటం విశేషం. యెన్.టి.ఆర్. నటించిన మొదటి చిత్రం “మన దేశం” 1949 నవంబర్ 24 న దుర్గా కళామందిర్ లోనే రిలీజ్ అయింది, ఆ తరువాత యెన్.టి.ఆర్. నటించిన చివరి చిత్రం ” శ్రీనాధ కవి సార్వభౌమ” 1993 అక్టోబర్ 10 న ఇదే ధియేటర్ లో రిలీజ్ అయింది. ఇది నిజం గ ఒక అరుదయిన రికార్డు అని చెప్పుకోవాలి. దురదృష్టం ఏమిటంటే అంతటి ఘన చరిత్ర కలిగిన దుర్గా కళామందిర్, కాల క్రమంలో కనుమరుగై పోయింది, మౌనంగా చరిత్ర పుటల్లోకి జారిపోయినది..!!

Fan builds temple in honour of heroine Samantha!

agent!