in

Mahesh Babu’s next project may be directed by Lokesh?

Keerthy Suresh’s Dorothy

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు గ్లోబల్ సినిమాకి తన ‘వారణాసి’తో పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత డెఫినెట్ గా మహేష్ సినిమాల విషయంలో మరింత ఆసక్తి నెలకొంటుంది. అయితే అందుకు తగ్గట్టుగానే మహేష్ లైనప్ కి సంబంధించి క్రేజీ బజ్ ఇపుడు వినిపిస్తుంది. ఇటీవల కోలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ అల్లు అర్జున్ తో చేయాల్సిన సినిమా మహేష్ తో చేస్తాడని పలు రూమర్స్ వచ్చాయి కానీ అందులో ఎలాంటి నిజం లేదు..

కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ తో సంబంధం లేకుండా పూర్తిగా మహేష్ కోసం లోకేష్ ఓ సబ్జెక్టు రెడీ చేస్తున్నట్టుగా క్రేజీ రూమర్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి. సో ఆ సినిమా తర్వాత ఈ సినిమా ఉండొచ్చేమో అనుకోవాలి. ప్రస్తుతానికి ఈ కాంబినేషన్ ఇంకా చర్చల దశలోనే ఉన్నట్టు తెలుస్తుంది. లోకేష్, మహేష్ కి తన స్క్రిప్ట్ రెడీ అయ్యాక నరేషన్ ఇవ్వనున్నాడట. మరి ఇది కానీ వర్క్ అయితే మాత్రం ఫ్యాన్స్ కి పండుగే అని చెప్పవచ్చు..!!

Preity Mukhundhan to romance bloody romeo!