
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ అభిమానులకు ఆసక్తికరమైన వార్త. ఇటీవల గుజరాత్‌లో సంచలన విజయం సాధించిన ‘లాలో: కృష్ణ సదా సహాయతే’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ రీమేక్‌లో శ్రీకృష్ణుడి పాత్రకు రామ్‌చరణ్ పేరును పరిశీలిస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది..
నిర్మాత మహవీర్ జైన్ తెలుగు రీమేక్ కోసం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. సుమారు రూ.50 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘లాలో’ ప్రపంచవ్యాప్తంగా రూ.122 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. రూ.100 కోట్ల మార్క్‌ను దాటిన తొలి గుజరాతీ చిత్రంగా రికార్డు సృష్టించింది. తెలుగు వెర్షన్‌లో శ్రీకృష్ణుడి పాత్రకు రామ్‌చరణ్‌ను తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఇది పూర్తి స్థాయి పాత్ర కాకుండా ప్రత్యేక అతిథి పాత్రగా ఉండనుందని తెలుస్తోంది..!!

