
స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రియా శరణ్, ప్రస్తుతం విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. గతేడాది మిరాయ్ లో అంబికా ప్రజాపతి పాత్రలో మెప్పించిన ఆమె, దృశ్యం-3 లోనూ కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా శ్రియా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. సూపర్ స్టార్ రజినీకాంత్‌తో కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన శ్రియా.. దానికి ‘హ్యాపీ డే’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫోటోలో రజినీకాంత్ తన తదుపరి చిత్రం ‘ధర్మన్’ లుక్‌లో కనిపించడం విశేషం.
దీంతో శ్రియా శరణ్ కూడా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారనే ప్రచారం ఊపందుకుంది. తాజా సమాచారం ప్రకారం..ఈ సినిమాలో రజినీకాంత్‌తో కలిసి శ్రియా శరణ్ ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. రజినీకాంత్, శ్రియా శరణ్ కాంబినేషన్ అనగానే అభిమానులకు ముందుగా గుర్తొచ్చేది బ్లాక్‌బస్టర్ చిత్రం ‘శివాజీ’. ఈ సినిమా విడుదలై దాదాపు 19 ఏళ్లు పూర్తైన తర్వాత మరోసారి వీరిద్దరూ ఒకే స్క్రీన్‌పై కనిపించబోతున్నారనే వార్త ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది..!!

