
మైసా’ సినిమాలోని ఓ డ్యాన్స్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని, ప్రస్తుతం తాను కోలుకుంటున్నానని తెలిపారు. తన గాయం గురించి, విశ్రాంతి గురించి వివరిస్తూ సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. “గాయాలు చాలా బాధిస్తాయి. ఈ విషయం ఎవరికీ తెలియకూడదని నేను నిజంగా ఆశించాను. కానీ, ఇప్పుడు అందరికీ తెలిసింది. ఇన్ని రోజులు కనిపించనందుకు క్షమించండి. నేను మళ్ళీ వచ్చేశాను. ఇది జరిగి కొంతకాలం అయింది..
వరుసగా ఇది నాకు మూడో గాయం. నా శరీరాన్ని యంత్రంలా కాకుండా, మనిషి శరీరంలా చూడటం నేను కచ్చితంగా నేర్చుకోవాలి” అని రష్మిక తన పోస్ట్‌లో పేర్కొన్నారు. తన గాయం తీవ్రతను వివరిస్తూ, “ఈ గాయం గురించి ఎలా చెప్పాలంటే.. మన తుంటికి, కాలికి మధ్య నాలుగు టెండన్లు ఉంటాయి. వాటిలో నా కుడి వైపు ఉన్న ఒక టెండన్ తెగిపోయింది. అది మళ్లీ అతుక్కుంటేనే నేను కాలు పైకి ఎత్తగలను. ‘మైసా’ సినిమాలోని డ్యాన్స్ షూట్‌లో ఇది జరిగింది. నేను ఇప్పటివరకు చేసిన చిత్రాల్లో ఇదే అత్యంత అగ్రెసివ్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. కానీ కంగారు పడకండి. నొప్పి ఉన్నా భరించలేనిది ఏమీ కాదు” అని ఆమె వివరించారు..!!

