
స్టార్ బ్యూటీ సాయి పల్లవి తన సినిమాల ఎంపికలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తుంటుంది. మంచి కథ, ప్రాధాన్యత ఉన్న పాత్రల కోసం వేచి చూస్తూ ఆమె పలు తెలుగు అవకాశాలను పక్కన పెట్టింది. ప్రస్తుతం బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్ సరసన ‘రామాయణం’ చిత్రంలో సీత పాత్రలో నటించడంపైనే ఆమె ప్రధానంగా దృష్టి సారించింది. ఈ భారీ పాన్-ఇండియా ప్రాజెక్టు పనుల్లో బిజీగా ఉండటం వల్ల కొద్దిరోజులుగా ఆమె తెలుగు సినిమాలకు దూరంగా ఉంటుంది..
అయితే, కాస్త లాంగ్ గ్యాప్ తర్వాత సాయి పల్లవి మళ్లీ తెలుగు తెరపై అలరించేందుకు సిద్ధమవుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రముఖ దర్శకుడు కిషోర్ తిరుమల ఇటీవల ఒక కొత్త కథతో సాయి పల్లవిని సంప్రదించినట్లు సమాచారం. ప్రస్తుతం వీరి మధ్య చర్చలు తుది దశకు చేరుకున్నాయని, ఈ ప్రాజెక్టు పట్ల ఆమె కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఇక ఇందులో మైథాలజీకి సంబంధించిన అంశాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది..!!

