
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తన తదుపరి ప్రాజెక్ట్‌లతో భారతీయ సినీ పరిశ్రమలో తీవ్రమైన ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. ప్రస్తుతం ఆయన లైనప్‌లో ఉన్న చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో కోలీవుడ్ సంచలన దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌తో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ‘AA23’గా ప్రచారంలో ఉన్న ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఉండగానే, దీనికి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌కు జోడీగా పూజా హెగ్డేను తీసుకోనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది..
ఒకవేళ ఈ వార్త నిజమైతే, అల్లు అర్జున్-పూజా హెగ్డే కాంబినేషన్‌లో ఇది మూడో చిత్రం అవుతుంది. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన ‘దువ్వాడ జగన్నాథం’, ‘అల వైకుంఠపురములో’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి. ముఖ్యంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ ఇండస్ట్రీ హిట్‌గా నిలవడమే కాకుండా వారి మధ్య కెమిస్ట్రీ, ‘బుట్టబొమ్మ’ పాట దేశవ్యాప్తంగా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలో ఈ హిట్ పెయిర్ మళ్లీ కలిస్తే అంచనాలు ఆకాశాన్ని తాకడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో ‘రాకా’ అనే పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు..!!

