
టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల కెరీర్ ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన మలుపు తిరిగింది. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ, ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఆమె మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను కోల్పోయినట్లు కోలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ సరసన నటించే అవకాశాన్ని శ్రీలీల తృటిలో మిస్ చేసుకుందని, ఆమె స్థానంలో కయాదు లోహర్‌ను ఎంపిక చేశారని వార్తలు వస్తున్నాయి.
దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ, సోషల్ మీడియాలో ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇటీవలే అఖిల్ ‘లెనిన్’ నుండి కూడా శ్రీలీల తప్పుకున్న సంగతి తెలిసిందే. దాదాపు వారం రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొన్న తర్వాత, డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆమె ఈ సినిమా నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చిన భాగ్యశ్రీ బోర్సే తన నటనతో, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో, శ్రీలీల ఒక మంచి అవకాశాన్ని చేజార్చుకుందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం ప్రారంభించారు..!!

