
డాన్ 3’ సినిమా స్క్రిప్ట్ మార్పుల విషయంలో హీరో రణ్‌వీర్ సింగ్, నిర్మాత ఫర్హాన్ అక్తర్ మధ్య వివాదం చెలరేగింది. సినిమా ఆలస్యం కావడం వల్ల తమకు భారీ నష్టం వాటిల్లిందని, రూ.45 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని నిర్మాతలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) మే 25న రణ్‌వీర్‌పై బ్యాన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ నిర్ణయంపై రణ్‌వీర్ సింగ్ చట్టపరంగా స్పందిస్తూ FWICE సంస్థకు లీగల్ నోటీసులు పంపాడు. దీంతో వెనక్కి తగ్గిన ఫెడరేషన్, కేవలం రెండు వారాల లోపే ఆ బ్యాన్‌ను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. నిర్మాతలకు నష్టం కలిగించవద్దని ప్రొడ్యూసర్స్ గిల్డ్ కూడా ఈ సందర్భంగా పేర్కొంది. ప్రస్తుతం బ్యాన్ తొలగింపుపై రణ్‌వీర్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. వివాదాలను పక్కన పెట్టి, ఆగస్టు నుంచి ప్రారంభం కానున్న తన సరికొత్త జాంబీ చిత్రం ‘ప్రళయ్’ షూటింగ్ మరియు ప్రీ-ప్రొడక్షన్ పనులపై ఆయన బిజీగా ఉన్నాడు..!!

