
ఒకప్పుడు టాలీవుడ్ ‘గోల్డెన్ లెగ్’గా వెలిగిపోయిన పూజా హెగ్డేకు గత కొంతకాలం పెద్దగా కలిసిరావడం లేదు. ఆమె నటించిన భారీ ప్రాజెక్టులు రాధే శ్యామ్, ఆచార్య, బీస్ట్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాయి. దీనికి తోడు మహేష్ బాబు ‘గుంటూరు కారం’ వంటి క్రేజీ ప్రాజెక్ట్ నుండి ఆమె తప్పుకోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. టాలీవుడ్‌లో కొత్త అవకాశాలు తగ్గడం, వచ్చిన ఆఫర్లను ఆమె తిరస్కరించడం వంటి పరిణామాలు చూస్తుంటే, ఆమె కావాలనే సినిమాలకు దూరం జరుగుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
సినిమా గ్లామర్ ప్రపంచం నుండి తప్పుకోవడానికి ప్రధాన కారణం ఆమె వ్యక్తిగత జీవితం మరియు భవిష్యత్తు ప్రణాళికలేనని ఇండస్ట్రీ వర్గాల టాక్. కొన్నేళ్లుగా విశ్రాంతి లేకుండా షూటింగ్‌లలో పాల్గొన్న పూజ, ఇప్పుడు తన కుటుంబంతో సమయం గడపాలని భావిస్తున్నట్లు సమాచారం. అలాగే, కేవలం నటనకే పరిమితం కాకుండా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కోసం వ్యాపార రంగంలోకి అడుగుపెట్టే ఆలోచనలో ఆమె ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే బాలీవుడ్‌లో కూడా కొత్త సినిమాలకు సంతకం చేయడానికి ఆమె ఆసక్తి చూపడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు..!!

