
ఇటీవల జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. “సినిమాలు విడుదల కావడానికి ముందు హీరోలు తప్పనిసరిగా డ్రగ్ టెస్టులు చేయించుకోవాలి. రిపోర్టులో నెగటివ్ వస్తేనే వారి సినిమాలను థియేటర్లలో ప్రదర్శించాలి” అని ఆయన డిమాండ్ చేశారు. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉండి యువతను ప్రభావితం చేసే హీరోలు పారదర్శకంగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలు నేరుగా ఇండస్ట్రీని టార్గెట్ చేసినట్లు ఉండటంతో, మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా ఘాటుగానే స్పందించారు..
కేవలం సినిమా రంగాన్నే ఎందుకు వేలెత్తి చూపిస్తున్నారని ప్రశ్నిస్తూ..రాజకీయ నాయకులకు కూడా ఒక సవాల్ విసిరారు. “సినిమా విడుదలకు ముందు మేము డ్రగ్ టెస్టులు చేయించుకోవడానికి సిద్ధమే. కానీ, అదే తర్కంతో ఆలోచిస్తే..ఎన్నికల్లో పోటీ చేసే ప్రజాప్రతినిధులు కూడా ఎలాంటి టెస్టులు చేయించుకోవాలో ఎమ్మెల్యే గారు చెప్తారా?” అని ప్రశ్నించారు. ప్రజలను పాలించే ఎమ్మెల్యేలు, సమాజంలో అత్యంత బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండేవారు కూడా పారదర్శకంగా ఉండాలని, కేవలం గ్లామర్ ఫీల్డ్‌ను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని విష్ణు హితవు పలికారు..!!

