
అస్సాం నుంచి వచ్చి కన్నడ చిత్రం ‘మొగిల్ పేట’తో వెండితెరకు పరిచయమైన కయాదు లోహర్, అతి తక్కువ కాలంలోనే దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తెలుగులో శ్రీవిష్ణు సరసన ‘అల్లూరి’ చిత్రంతో అడుగుపెట్టిన ఈమె, ఆ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తన గ్లామర్ మరియు నటనతో మేకర్స్ దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ప్రదీప్ రంగనాథన్ హీరోగా వచ్చిన ‘డ్రాగన్’ సినిమాలో హీరోయిన్గా నటించి మెప్పించడంతో ఆమె కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల జాబితాలో చేరిపోవడం విశేషం.
ఇటీవల విశ్వక్ సేన్‌తో కలిసి ‘ఫంకీ’ మూవీలో సందడి చేసిన కయాదు, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, ఆమె అందానికి యువత ఫిదా అయిపోయారు. ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని మరియు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ది ప్యారడైజ్’ లో ఈమె నటిస్తోంది. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం సెట్స్‌పై ఉండగానే, తాజాగా నందమూరి హీరో కళ్యాణ్ రామ్ సరసన నటించే అద్భుతమైన అవకాశం ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందించనున్న వెంకటేష్ – కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ మూవీలో కయాదును ఎంపిక చేసినట్లు సమాచారం..!!
