
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో రాబోతున్న ప్రాజెక్టు ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. పుష్ప చిత్రంతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్, ఇప్పుడు దర్శకుడు అట్లీతో కలిసి ఒక భారీ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ను సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమా గురించి వినిపిస్తున్న అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ఇందులో ఏకంగా ఐదుగురు స్టార్ హీరోయిన్లు నటించబోతున్నారట..
ఇప్పటికే రష్మిక మందన్న, దీపికా పదుకొణె, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ పేర్లు ప్రచారంలో ఉండగా, తాజాగా బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ కూడా ఈ ప్రాజెక్టులోకి చేరినట్లు వార్తలు వస్తున్నాయి. ఒకే సినిమాలో ఇంతమంది అగ్ర నాయికలు ఉండటం భారతీయ సినిమా చరిత్రలోనే ఒక అరుదైన విషయంగా మారుతోంది. ఇది కేవలం ఒక సినిమాగానే కాకుండా, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఒక భారీ ఈవెంట్‌లా నిలవబోతోందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు..!!
