in

Nani To Collaborate With Venky Atluri For Next?

నాచురల్ స్టార్ నాని ఇప్పుడు చేస్తున్న “ది ప్యారడైజ్” సినిమాతో నెక్స్ట్ లెవెల్ కి వెళుతున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా తర్వాత మరింత క్రేజీ లైనప్ ని నాని సిద్ధం చేసుకున్నాడు. వీటిలో దర్శకుడు సుజీత్ తో ‘బ్లడీ రోమియో’ అనే భారీ చిత్రం చేయనున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత తదుపరి సినిమా కూడా లాక్ అయిపోయినట్టు ఇప్పుడు వస్తుంది. ఈ కాంబినేషన్ కూడా ఒక ఊహించని కలయికే అన్నట్టు తెలుస్తుంది. ఈసారి నాని దర్శకుడు వెంకీ అట్లూరితో సినిమా చేయనున్నట్టు టాక్. ఆల్రెడీ నాని కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు తెలుస్తుంది. అలాగే ఈ చిత్రాన్ని ఇప్పుడు వెంకీతో వరుసగా సినిమాలు చేస్తున్న యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ కాంబినేషన్ లో దీనినీ లాక్ చేసినట్టు టాక్. మరి దీనిపై అధికారిక క్లారిటీ బయటకి రావాల్సి ఉంది..!!

Hansika Motwani divorced from husband Sohael Khaturiya!