
నటి రష్మిక మందన్న తన వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న అసత్య ప్రచారాల పట్ల అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. నటుడు విజయ్ దేవరకొండతో వివాహం జరిగిన కొద్ది రోజులకే, ఎనిమిదేళ్ల క్రితం నాటి తన తల్లి ఆడియో క్లిప్‌ను కావాలనే బయటకు తీసి వివాదం సృష్టించడంపై ఆమె తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత ఎనిమిదేళ్లుగా తనపై జరుగుతున్న వ్యక్తిగత దాడులను మౌనంగా భరించానని, అయితే ఇప్పుడు తన కుటుంబాన్ని కూడా ఇందులోకి లాగడం అన్ని హద్దులను దాటడమేనని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు..

