in

Adivi Sesh and Rahul Ravindran to join Hands!

డివి శేష్ తన కెరీర్ విషయంలో చాలా క్లారిటీగా ఉంటాడు. అందుకే ఆయన ఏ సినిమా చేసినా అది బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటుంది. స్క్రిప్ట్ వర్క్ కోసం ఎక్కువ సమయం కేటాయించే ఆయన, ప్రస్తుతం ‘డెకాయిట్’ మరియు ‘గూఢచారి 2’ వంటి ప్రతిష్టాత్మక చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం, అడివి శేష్ యాక్టర్ కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్‌తో ఒక కొత్త ప్రాజెక్ట్ గురించి చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

‘చి ల సౌ’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన రాహుల్ రవీంద్రన్, ఆ తర్వాత ‘మన్మథుడు 2’ మరియు విమర్శకుల ప్రశంసలు పొందిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రాలను తెరకెక్కించాడు. ప్రస్తుతం రాహుల్ రెండు కొత్త స్క్రిప్ట్‌లను సిద్ధం చేసుకోగా, అందులో ఒక కథను అడివి శేష్‌కు వినిపించాడు. ఈ నేరేషన్ శేష్‌కు బాగా నచ్చినప్పటికీ, తన ప్రస్తుత కమిట్‌మెంట్స్ వల్ల డేట్స్ కేటాయించడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియాల్సి ఉంది..!!

Mrithyunjay!

Bellamkonda Srinivas about romantic scenes with Samantha!