
మంచు మనోజ్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ మూవీ ‘డేవిడ్ రెడ్డి’. హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్ అనుకుంటున్నారు. ఈ సాంగ్ లో మనోజ్ తో కలిసి డాన్స్ చేయడానికి రాశి ఖన్నాను తీసుకోబోతున్నారని తెలుస్తోంది. మరి ఇప్పుడు మనోజ్ సరసన రాశి ఖన్నా ఎలాంటి స్పెషల్ సాంగ్ చేస్తోందో చూడాలి..
ఇక ‘డేవిడ్ రెడ్డి’ కథ విషయానికొస్తే.. స్వాతంత్రానికి పూర్వం జరిగిన కథ ఇది. బ్రిటిష్ వారిపై పోరాడిన ‘డేవిడ్ రెడ్డి’ అనే యోధుడి కథగా రానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ‘వార్ డాగ్’ అనే బైక్ను రూపొందించారు. దాని బరువు దాదాపు 700 కేజీలు. సినిమాలో అది ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అన్నట్టు ఈ సినిమాలో మనోజ్ సరసన ‘ప్రిన్స్’ కోలీవుడ్ మూవీ హీరోయిన్ మరియా నటించబోతుంది..!!
