
ఉప్పెన’తో తన మార్క్ చూపించేశాడు బుచ్చిబాబు. ఇప్పుడు రామ్ చరణ్ తో రూపొందిస్తున్న ‘పెద్ది’ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలోని ప్రమోషన్ కంటెంట్ ఆకట్టుకొంటోంది. ఇది ష్యూర్ షాట్ హిట్ అని ఇండస్ట్రీ అప్పుడే డిసైడ్ అయిపోతోంది. మరి బుచ్చిబాబు తదుపరి స్టెప్ ఎవరితో..? అనే డౌటు రాక మానదు. బుచ్చి కథ చెబుతానంటే పెద్ద హీరోలంతా వినడానికి రెడీనే..
ఓ దశలో బుచ్చిబాబు మహేష్ కి టచ్‌లో ఉన్నాడన్న వార్తలొచ్చాయి. కాకపోతే..‘వారణాసి’ తరవాత మహేష్ ఆలోచనలు ఎలా ఉంటాయో ఇప్పుడే ఊహించలేం. అయితే బుచ్చి మనసులో మాత్రం ప్రభాస్ ఉన్నాడట. ప్రభాస్ కి సరిపడా ఓ కథని బుచ్చి రెడీ చేశాడని, ప్రభాస్ ని కలిసే అవకాశం వస్తే, కథ చెప్పడం ఖాయమని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ‘పెద్ది’ హిట్ అయితే.. ప్రభాస్ నుంచి పిలుపు రావడం పెద్ద కష్టమేం కాదు..!!
