in

Sapthami Gowda calls paparazzi’s disrespectful and unacceptable!

బ్లిక్ ఈవెంట్‌లలో పాల్గొంటున్న సినీ నటీమణులను అభ్యంతర కోణాల్లో ఫొటోలు, వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల వేదికగా పోస్టు చేస్తున్నారని ప్రముఖ కన్నడ నటి సప్తమి గౌడ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుచిత కోణాల్లో జూమ్ చేసి పోస్టు చేయడం సరికాదని ఆమె కొంతమంది ఫొటో, వీడియో గ్రాఫర్లపై మండిపడ్డారు. ఇటీవల విడుదలైన ది రైజ్ ఆఫ్ అశోకలో సప్తమి గౌడ నటించారు.

తాజాగా ఆమె సామాజిక మాధ్యమం వేదికగా నటీమణులను అనుచితంగా చూపిస్తూ చేస్తున్న పోస్టులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నటీమణుల శరీరాలకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను పెడుతూ కొందరు వ్యక్తులు అనుసరిస్తున్న తీరు ఏమాత్రం సరికాదని అన్నారు. ఇది మహిళలను అవమానించడమేనని పేర్కొన్నారు. మేం మా నటన ద్వారా అలరించడానికి మాత్రమే సినిమాల్లో ఉన్నామని అన్నారు. ఉద్దేశపూర్వకంగా వీడియోలను, ఫొటోలను జూమ్ చేసి పోస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ఈవెంట్‌లను కవర్ చేసే వారు కూడా తమ వృత్తికి గౌరవం ఇచ్చేలా వ్యవహరించాలని సూచించారు..!!

venkatesh got Slapped by Director in Shooting Spot!

Sneha recalls about her spinal injury accident!