
ఆశించినస్థాయిలో గుర్తింపు రానప్పుడు ..విజయాలు అందనప్పుడు..అదృష్టం లేదని చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి అదృష్టాన్ని వెతికి పట్టుకునే పనిలో ఉంటారు. ప్రస్తుతం భాగ్యశ్రీ బోర్సే అదే పనిలో ఉందని అంటున్నారు. ఇప్పుడున్న కథానాయికలలో గ్లామరస్ బ్యూటీ ఎవరంటే కుర్రకారు ఠకీమని చెప్పే మాట భాగ్యశ్రీ బోర్సే. తుమ్మెదల్లాంటి కళ్లతో మనసులు దోచే ఈ సుందరికి ఇంతవరకూ హిట్టు పడలేదు. ఆమె అభిమానులు బెంగపెట్టుకోవడంలోని అసలు కారణం ఇదే..
ఈ నేపథ్యంలో ఆమె అఖిల్ సరసన నాయికగా ‘లెనిన్’ సినిమా చేస్తోంది. మురళీ కిశోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను, అన్నపూర్ణ – సితార సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘మే’లో ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. భాగ్యశ్రీ గ్లామర్ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ఈ సినిమాతోనైనా ఆమెకి అదృష్టం కలిసొస్తుందేమో చూడాలి మరి..!!

