
విజయ్ , రష్మిక పెళ్లి ప్రకటనతో అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది.. చాలా కాలంగా తమ ప్రేమను గోప్యంగా ఉంచుకున్న ఈ జంట, త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నట్టు అధికారికంగా వెల్లడించింది. తమ పేర్లలోని తొలి అక్షరాలను కలిపి ‘విరోష్’ పేరుతో పెళ్లి వేడుకలను నిర్వహిస్తున్నట్టు ప్రకటించడంతో సోషల్ మీడియాలో ఈ పేరు ట్రెండ్ అవుతోంది. పెళ్లి వార్త బయటకు వచ్చిన వెంటనే ఈ ఇద్దరి వ్యక్తిగత విషయాలపై చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా విజయ్, రష్మికల మధ్య ఉన్న వయసు తేడాపై నెటిజన్లు ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు..
సార్వత్రికంగా లభ్యమయ్యే సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ 1989 మే 9న జన్మించగా, రష్మిక మందన్న 1996 ఏప్రిల్ 5న పుట్టారు. ఈ లెక్కన వీరిద్దరి మధ్య సుమారు ఏడు సంవత్సరాల వయసు తేడా ఉంది. అయితే ఆ తేడా పెద్దగా అనిపించదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ప్రేమ, పరస్పర గౌరవం ఉన్నప్పుడు వయసు వ్యత్యాసం పెద్ద అంశం కాదని సోషల్ మీడియాలో చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. కొందరు అభిమానులు మాత్రం సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై ఇంతగా చర్చ అవసరమా అని ప్రశ్నిస్తున్నారు..!!
