
బుల్లి తెర పై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని, వెండితెరపై రాణిస్తున్న నటి, బిగ్‌బాస్ ఫేమ్ హిమజ రెడ్డి తాజాగా సోషల్ మీడియా వేదికగా విమర్శకులపై నిప్పులు చెరిగారు. కష్టపడి పైకొస్తున్న ఒక తెలుగమ్మాయి సక్సెస్‌ను చూసి ఓర్వలేక, క్యారెక్టర్ మీద పడి ఏడవడం ఏంటని ఆమె తీవ్రంగా ప్రశ్నించారు. గత కొంతకాలంగా తన లగ్జరీ లైఫ్, సంపాదనపై సోషల్ మీడియాలో వస్తున్న అసభ్యకరమైన కామెంట్లకు హిమజ తనదైన శైలిలో గట్టి కౌంటర్ ఇచ్చారు..
తను అనుభవిస్తున్న ఈ విలాసవంతమైన జీవితం వెనుక ఎంతో కష్టం ఉందని హిమజ స్పష్టం చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు సినిమాలు, సీరియల్స్‌లో శ్రమిస్తున్నానని, బిగ్‌బాస్ నుండి బయటకు వచ్చాక దాదాపు 12 షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నానని ఆమె గుర్తు చేశారు. ఒక్కో ఓపెనింగ్‌కు వచ్చే పారితోషికమే తను వాడుతున్న కారు కొనడానికి సరిపోతుందని ఘాటుగా సమాధానమిచ్చారు. కేవలం నటన మాత్రమే కాకుండా, హెర్బాలైఫ్ సూపర్‌వైజర్‌గా, స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా రాణిస్తూ, సొంతంగా ఒక కంపెనీని కూడా నడుపుతున్నట్లు ఆమె వెల్లడించారు..!!