in

Aishwarya Rajesh and Vikranth join hands for Under 18!

టి ఐశ్వర్య రాజేశ్, నటుడు విక్రాంత్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న కొత్త చిత్రానికి ‘అండర్ 18’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా టైటిల్ లుక్‌ను ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ ఆవిష్కరించడం విశేషం. ఈ చిత్ర దర్శకుడు కార్తీక్ పెరుమాల్‌సామి గతంలో వెట్రిమారన్ దగ్గర అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఎస్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బి. జగదీశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘మద్రాస్‌కారన్’ విజయం తర్వాత ఈ సంస్థ నిర్మిస్తున్న చిత్రమిది..

‘అండర్ 18’ సినిమా వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఒక ఎమోషనల్ క్రైమ్ డ్రామా అని చిత్ర యూనిట్ తెలిపింది..నేరం కారణంగా ప్రభావితమైన ఒక కుటుంబం యొక్క భావోద్వేగాలను, క్రైమ్ ప్రపంచంలోని క్రూరమైన కోణాలను ఈ సినిమాలో చూపించనున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులోని అంతగా వెలుగులోకి రాని కొన్ని నేరాల నేపథ్యాన్ని దర్శకుడు ఈ కథ కోసం ఎంచుకున్నారని సమాచారం. సామాజిక వాస్తవికత, కుటుంబ భావోద్వేగాల కలబోతగా ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు..!!

Mrunal Thakur opens up about love and the power of patience!

Meenakshi Choudhary Set for Bollywood Debut with top star!