
అనుపమ పరమేశ్వరన్ తన ఫ్యాన్స్‌కు అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చింది. పాన్ ఇండియా లెవల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు మరో క్రేజీ మూవీకి సైన్ చేసింది. ఎస్ కే గీ ఎంటర్టైన్మెంట్ Ess Kay Gee Entertainment, బెంచ్‌మార్క్ స్టోరీ టెల్లర్స్ సంస్థలు సంయుక్తంగా అనుపమ మెయిన్ లీడ్‌గా ఒక కొత్త సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేశాయి. ఈ సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే ఒక ఇంటెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కబోతోంది..
ఈ ప్రాజెక్ట్‌కి RJ Shaan డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఒక ప్రముఖ స్టూడియోతో కలిసి శివిన్ నారంగ్, ప్రేరణ అరోరా, కిరణ్ బల్లపల్లి ఈ మూవీకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఈ ఏడాది మే నెలలో స్టార్ట్ కానుంది. అలాగే సినిమా టైటిల్ ఏంటి అనేది కూడా చిత్ర యూనిట్ త్వరలోనే రివీల్ చేయనుంది. ఈ ప్రాజెక్ట్ ఇండస్ట్రీలో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది..డైరెక్టర్ ఆర్జే షాన్ మరియు అనుపమ కాంబినేషన్. గతంలో వీళ్లిద్దరి కలయికలో వచ్చిన షార్ట్ ఫిల్మ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ మీద అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది.!!

