
తాజాగా ఒక అంతర్జాతీయ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..భారతీయ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఒక విలక్షణమైన గుర్తింపు రావాలని ఆకాంక్షించారు. జపాన్ దేశానికి చెందిన యానిమేషన్ చిత్రాలు, దక్షిణ కొరియాకు చెందిన కె-పాప్ సంగీతం ప్రపంచవ్యాప్తంగా ఎలాగైతే ఒక భారీ ఫ్యాన్ బేస్‌ను సృష్టించుకున్నాయో, మన భారతీయ కథలు కూడా అంతర్జాతీయ స్థాయిలో అదే స్థాయి ఆదరణ పొందాలని ఆయన కోరుకుంటున్నారు. మన దేశపు వైవిధ్యభరితమైన సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పే సమయం ఆసన్నమైందని ఆయన అభిప్రాయపడ్డారు.
భారతదేశంలో డెమొన్ స్లేయర్ వంటి జపనీస్ యానిమేషన్ చిత్రాలు సాధిస్తున్న భారీ వసూళ్లు మరియు వాటికి ఇక్కడ ఉన్న క్రేజ్ తనను ఆశ్చర్యపరిచాయని రాజమౌళి పేర్కొన్నారు. భాషా సరిహద్దులు దాటి ప్రేక్షకులు ఇతర దేశాల కంటెంట్‌ను ఎలా ఆస్వాదిస్తున్నారో ఇది నిరూపిస్తోందని ఆయన అన్నారు. అదే తరహాలో మన తెలుగు మరియు భారతీయ కథలు కూడా విదేశీ ప్రేక్షకులను అలరించాలని ఆయన భావిస్తున్నారు. ‘RRR’ చిత్రం ఆస్కార్ వేదికపై మెరవడం, జపాన్ వంటి దేశాల్లో భారీ విజయం సాధించడం తన నమ్మకాన్ని మరింత బలపరిచిందని ఆయన స్పష్టం చేశారు..!!
