in

Priya Bhavani Shankar Revealed as Female Lead to Ravi Teja!

వి తేజ కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఇరుముడి చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. కాగా మహా శివరాత్రి సందర్భంగా చిత్రబృందం తాజా అప్ డేట్ ఇచ్చింది. ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్‌ హీరోయిన్ గా నటిస్తోందని చిత్రబృందం పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. పోస్టర్‌ లో ఆమె రవితేజ సరసన సహజంగా కనిపిస్తుంది. ఇక ఈ చిత్రంతో ఆమె చేస్తున్న అతిపెద్ద తెలుగు ప్రాజెక్ట్‌ ఇదే కావడం విశేషం..

ఇక ‘కొన్ని కథలు జీవితంలో సరైన సమయంలో మనల్ని ఎంచుకుంటాయి. అలాంటి ఒక కథే ఈ ఇరుముడి. ఇందులో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. కొత్త ప్రయాణంలో ఉత్సాహంగా ఉన్నా’’ అని రవితేజ ఆ మధ్య చెప్పుకొచ్చారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో కథానాయికగా ప్రియా భవానీ శంకర్‌ నటిస్తుండగా..GV ప్రకాశ్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో బేబీ నకాస్త్ర రవితేజ కుమార్తెగా నటిస్తోంది..!!

king nagarjuna nu bayapettina sridevi!