in

3 heroines fixed for venkatesh anil ravipudi’s next?

నిల్, వెంకీ సినిమాను జూన్–జులై నెలల్లో షూటింగ్ ప్రారంభించి, వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారు. వెంకటేష్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే, మహానటి కీర్తీ సురేష్ నటించనున్నట్లు సమాచారం. కథలో కీలకమైన పాత్రల కోసం ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్లను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. బుట్టబొమ్మ, మహానటి కలిసి ఒకే సినిమాలో కనిపిస్తే..ఆ క్రేజ్ వేరే లెవల్‌లో ఉండనుందని అభిమానులు భావిస్తున్నారు..

ఇంకో ఆసక్తికర అంశం ఏమిటంటే..ఈ సినిమాలో మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలో నటిస్తున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ‘పుష్ప’ సినిమాలో విలన్‌గా అదరగొట్టిన ఫహాద్.. ఇప్పుడు వెంకటేష్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేయడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. కథ ప్రకారం ఆయన వెంకటేష్ తమ్ముడి పాత్రలో కనిపించనున్నట్టు టాక్. ఫహాద్ జోడిగా హాట్ భామ ఆషికా రంగనాథ్ ఎంపిక అయినట్లు తెలుస్తోంది. దీంతో మొత్తం మీద ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు కీలక పాత్రల్లో కనిపించనున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి..!!

vijay d, keerthy suresh keep all hopes on rowdy janardhan!