in

Mrunal Thakur reacts about working with Allu Arjun!

స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఇటీవల ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘భీగి భీగి’ అనే మ్యూజిక్ వీడియోతో ఆమె ప్రేక్షకులను పలకరించారు. ఇందులో తన ‘సీతారామం’ కో-స్టార్ దుల్కర్ సల్మాన్‌తో కలిసి మృణాల్ నటించారు. ఈ పాట ప్రమోషన్లలో భాగంగా అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న AA22 సినిమాలో ఆమె నటిస్తున్నట్లు వస్తున్న వార్తలపై మృణాల్ ఓపెన్ అయింది..

ఈ క్రేజీ ప్రాజెక్టులో మృణాల్ ఒక కీలక పాత్ర పోషిస్తోందని, ఇప్పటికే షూటింగ్‌లో కూడా పాల్గొందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై మృణాల్ స్పందిస్తూ.. “అవునా? నిజంగానే నాకే ఆ ఛాన్స్ వచ్చిందా? అయితే ఖచ్చితంగా ప్రార్థించండి, అదే నిజమైతే మనమందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం” అంటూ సరదాగా సమాధానమిచ్చింది. దీంతో తనపై వస్తున్న వార్తలన్నీ కేవలం రూమర్స్ మాత్రమేనని ఆమె తేల్చి చెప్పింది. అయితే, భవిష్యత్తులో అల్లు అర్జున్‌తో కలిసి పని చేసే అవకాశం వస్తే మాత్రం చాలా సంతోషిస్తానని తన మనసులోని మాటను బయటపెట్టింది..!!

Pooja Hegde Teams Up with Nani for ‘Bloody Romeo’!

big mistake: nagarjuna preferred coolie over Dhurandhar