in

Mrunal Thakur Opens Up About Breaking Up With Her Ex!

టాలీవుడ్ సెన్సేషన్ మృణాల్ ఠాకూర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. తన అందం, అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే ఈ భామ.. తాజాగా తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఒక ఆసక్తికర విషయాన్ని బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. తన మాజీ ప్రేమికుడు తనతో ఎందుకు విడిపోయాడో చెబుతూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి..

మృణాల్ నటించిన తాజా చిత్రం ‘దో దీవానే శహర్‌ మే’ ఫిబ్రవరి 20న విడుదల కానుంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన పాత ప్రేమ బంధం గురించి ఆమె స్పందించారు. “నాకు దూకుడు ఎక్కువని, నాతో కలిసి ఉండలేనని అతను బ్రేకప్ చెప్పాడు. అంతేకాకుండా నేను యాక్టింగ్ చేయడం కూడా అతనికి నచ్చలేదు. అందుకే విడిపోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే దీనికి నేనేం బాధపడలేదు..కానీ అతని మనస్తత్వం చూసి జాలిపడ్డాను” అని మృణాల్ బోల్డ్‌గా సమాధానమిచ్చారు..!!

After Sreeleela, Sai Pallavi joins alongside Dhanush!

Priyamani to be paired opposite Chiranjeevi!