
ప్రభాస్ చేతిలో ప్రజెంట్ అరడజను సినిమాలు చేతిలో ఉన్నాయి. వీటిలో ప్రజెంట్ ‘స్పిరిట్’, ‘ఫౌజి’ సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. ‘స్పిరిట్’ సినిమా వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్. ఫౌజి సినిమా రిలీజ్ ను ఈ ఏడాదే ప్లాన్ చేశారు. కానీ ఈ చిత్రం రిలీజ్ కూడా వచ్చే ఏడాదే అన్నట్లుగా ఉంది. ఈ రెండు చిత్రాలతో పాటుగా ప్రభాస్ ‘కల్కి 2’ సినిమానూ సెట్స్‌పైకి తీసుకుని వెళ్లాలని నిర్ణయించు కున్నాడు. ఈ దిశగా నాగ్ అశ్విన్ కార్యచరణ ప్రారంభించారు. ఫిబ్రవరి మొదటివారంలో ‘కల్కి 2’ సినిమా చిత్రీకరణను ప్రారంభించాలని ఏర్పాట్లు చేస్తున్నారు..
అయితే ‘కల్కి’ సినిమాలో దీపికా పదుకొనెది చాలా కీలకమైన పాత్ర. కానీ ఈ ప్రాజెక్ట్ నుంచి దీపిక పదుకొనెను తప్పించారు మేకర్స్. దీంతో దీపిక ప్లేస్‌లో సాయిపల్లవిని తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. గతంలో ఆలియాభట్, ప్రియాంకా చోప్రా వంటివార్ల పేర్లు వినిపించినా, ఎవరు ఫైనలైజ్ కాలేదు..చిత్రీకరణ సమయం దగ్గరపడుతున్న తరుణంలో ఈ సినిమాలో దీపిక చేసిన సుమతి పాత్రను ఎవరు చేయబోతున్నారనే విషయంపై త్వరలోనే ఓ స్పష్టత వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఊహించవచ్చు..!!
