
రాజ్ నిడిమోరు ను వివాహం చేసుకున్న తర్వాత సమంత నటిస్తున్న మొదటి చిత్రమిది. తాజా సమాచారం ప్రకారం, ‘మా ఇంటి బంగారం’ టైటిల్ కార్డ్స్‌లో తన పేరును సమంత నిడిమోరుగా వేయాలని ఆమె చిత్ర యూనిట్‌కు సూచించినట్లు తెలుస్తోంది. భర్త రాజ్ నిడిమోరుపై ఉన్న ప్రేమతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. విశేషమేమిటంటే, ఈ చిత్రానికి రాజ్ నిడిమోరు కథను అందించగా, సమంతకు అత్యంత ఆప్తురాలైన నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా సమంత తన ఇన్‌స్టాగ్రామ్ లేదా ఇతర సామాజిక మాధ్యమాల్లో పేరు మార్చలేదు.
కేవలం సినిమాల్లో మాత్రమే ఈ కొత్త పేరును వాడాలని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది. సమంత పేరు మార్పుపై అభిమానులు ఇంతలా చర్చించుకోవడానికి ఒక బలమైన నేపథ్యం ఉంది. గతంలో నాగచైతన్యతో వివాహం జరిగినప్పుడు ఆమె తన పేరును ‘సమంత అక్కినేని’గా మార్చుకున్నారు. అయితే, విడాకులకు ముందే ఆ ఇంటి పేరును తొలగించి, కేవలం ‘సమంత’ అని మాత్రమే ఉంచుకున్నారు. గత చేదు అనుభవాల దృష్ట్యా సోషల్ మీడియాలో పేరు మార్చడానికి ఆమె ఇష్టపడటం లేదని, కానీ భర్త గౌరవార్థం స్క్రీన్ నేమ్ మార్చుకోవాలని అనుకుంటున్నారని సన్నిహిత వర్గాల టాక్..!!

