in

anil ravipudi: Prequel for Bhagavanth Kesari on cards

మెగాస్టార్ చిరంజీవితో తీసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, తన నెక్స్ట్ ప్రాజెక్టులపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణతో తాను తీసిన ‘భగవంత్ కేసరి’ చిత్రానికి సీక్వెల్ లేదా ప్రీక్వెల్ వచ్చే అవకాశం ఉందని హింట్ ఇచ్చారు. తన కెరీర్‌లో ‘భగవంత్ కేసరి’ చాలా స్పెషల్ అని పేర్కొన్న అనిల్..

బాలయ్య అభిమానుల కోరిక మేరకు ఈ కథను ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. బాలకృష్ణ పాత్ర పోలీస్ ఆఫీసర్‌గా మారకముందు ఏం జరిగింది అనే పాయింట్‌తో ‘ప్రీక్వెల్’ తీస్తే చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అంటే రాబోయే చిత్రం బాలయ్య పోలీస్ క్యారెక్టర్ చుట్టూ తిరిగే అవకాశం ఉందని అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు. చిరంజీవి సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్‌ను అందుకున్న అనిల్, ఇప్పుడు బాలయ్యతో మరో సెన్సేషన్‌కు సిద్ధమవుతుండటంతో నందమూరి అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది..!!

Prabhas rewarded ‘the rajasaab’ team despite the mixed talk!