
RRR తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమా ‘దేవర’. పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ అయ్యింది. అయితే ‘దేవర 2’ గురించి తర్వాత అప్డేట్ లేదు. ఆ సినిమా క్యాన్సిల్ అయ్యిందని, పక్కన పెట్టేశారని గుసగుసలు వినిపించాయి. అటువంటిది ఏమీ లేదని అప్పుడప్పుడూ పోస్టర్స్ ద్వారా క్లారిటీ ఇస్తున్నారు. అయితే ఇప్పుడు చిత్ర నిర్మాత అధికారికంగా అప్డేట్ ఇచ్చారు..
మే నుంచి ‘దేవర’ రెగ్యులర్ షూటింగ్ మొదలు పెడతామని సుధాకర్ మిక్కిలినేని చెప్పారు. సో, అప్పటికి ‘డ్రాగన్’ షూట్ ఎన్టీఆర్ పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. ‘దేవర 2’ షూట్ గురించి మాత్రమే కాదు..మరొక అప్డేట్ కూడా ఇచ్చారు సుధాకర్ మిక్కిలినేని. సినిమా విడుదల గురించి ఆయన మాట్లాడారు. వచ్చే ఏడాది 2027 విడుదల అవుతుందని, అది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చెప్పారు. జనగాంలో జరిగిన ఓ ఈవెంట్ లో ఆయన ఈ విషయాలు చెప్పారు. అదీ సంగతి..!!
