in

Tamannaah Bhatia says she had two heartbreaks!

మన్నా భాటియా తన వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా ప్రేమ, బ్రేకప్‌లపై చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమ, ఆ తర్వాత విడిపోయినట్లు వచ్చిన వార్తలపై పరోక్షంగా స్పందిస్తూ, తన జీవితంలో ఎదురైన ఓ బంధాన్ని ప్రమాదకరంగా అభివర్ణించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తమన్నా, తన జీవితంలో రెండుసార్లు తీవ్రంగా బాధపడ్డానని (హార్ట్ బ్రేక్) తెలిపారు..

యుక్త వయసులో మొదటిసారి ప్రేమలో పడ్డానని, అయితే అప్పుడు కెరీర్‌కు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ బంధం నుంచి బయటకు వచ్చానని వివరించారు. ఆ తర్వాత మరో వ్యక్తితో ప్రేమలో ఉన్నప్పటికీ, కొంతకాలానికే అతను తనకు సరైన జోడీ కాదని గ్రహించానని పేర్కొన్నారు. “అలాంటి బంధంలో కొనసాగడం నా వ్యక్తిత్వానికి, భవిష్యత్తుకు ప్రమాదకరం అనిపించింది. అందుకే ఆ రిలేషన్‌షిప్‌కు ముగింపు పలికాను” అని తమన్నా చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది..!!

raashi khanna to replace meenkashi chaudhary for hindi remake!

ap dcm Pawan Kalyan Rejects rs 40 Crore Tobacco Ad Offer!