in

Keerthy suresh did 9 hours nonstop dubbing day studio snap!

జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ నటి కీర్తి సురేశ్ తన డెడికేషన్‌తో మరోసారి అభిమానులను ఆకట్టుకుంది. తాజాగా ఒక సినిమా కోసం ఏకంగా 9 గంటల పాటు డబ్బింగ్ చెప్పినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. డబ్బింగ్ స్టూడియోలో కాస్త అలసిపోయినట్లుగా ఉన్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పంచుకుంటూ.. “9 గంటల డబ్బింగ్ తర్వాత నా పరిస్థితి ఇది” అని పేర్కొంది. ఈ పోస్ట్ ఆమె పని పట్ల చూపే నిబద్ధతను తెలియజేస్తోంది..

తన పాత్రలకు తానే సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం కీర్తి సురేశ్ ప్రత్యేకత. ‘మహానటి’ చిత్రంలో సావిత్రి పాత్రకు తమిళం, తెలుగు భాషల్లో ఆమె చెప్పిన డబ్బింగ్ సినిమాకు ప్రాణం పోసి, జాతీయ అవార్డును సాధించిపెట్టింది. ఇటీవల వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’లో ‘బుజ్జి’ అనే ఏఐ క్యారెక్టర్‌కు ఏకంగా 5 భాషల్లో వాయిస్ అందించి తన విలక్షణతను చాటుకుంది. ఆమె వాయిస్ మాడ్యులేషన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం కీర్తి సురేశ్ చేతిలో పలు భాషల్లో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి..!!

happy birthday ravi teja!

Akhil Akkineni touching rayalaseema faction backdrop for lenin!