in

Top 10 richest telugu heroes!

10. PAWAN KALYAN

వన్ కళ్యాణ్ ఆస్తుల విలువ 2024 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం సుమారు ₹164.54 కోట్లు, వీటిలో స్థిరాస్తులు మరియు చరాస్తులు ఉన్నాయి, కానీ ఆయనకు ₹65 కోట్లకు పైగా అప్పులు కూడా ఉన్నట్లు అందులో తెలిపారు..ఆయన సంపాదన ప్రధానంగా సినిమా, పెట్టుబడులు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా వస్తుంది, ముఖ్యంగా ఇటీవలి ప్రాజెక్ట్‌లలో అధిక పారితోషికం అందుకున్నారు..అంతేగాక ఆయనకు విజయవాడ, హైదరాబాద్‌ నగరాల్లో ఖరీదైన బంగ్లాలు ఉన్నాయి. సినిమాలు, రాజకీయాలు, రియల్ ఎస్టేట్ పెట్టుబడులే ఆయనకు ప్రధాన ఆదాయం.

09. PRABHAS

బాహుబలి సినిమాతో ఇంటర్నేషనల్ స్టార్‌గా ఎదిగిన ప్రభాస్..ఈ లిస్టులో ఏడో స్థానంలో ఉన్నారు. రెబల్ స్టార్ ఆస్తుల విలువ సుమారు రూ.240 కోట్లు ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. ప్రభాస్ ఆస్తుల కంటే ఆయన సినిమా రెమ్యునరేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్కో సినిమాకు రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు తీసుకుంటున్న ప్రభాస్, వచ్చిన ఆదాయంలో ఎక్కువ భాగాన్ని విదేశాల్లో రియల్ ఎస్టేట్ పెడుతున్నట్లు సమాచారం..

08. MAHESH BABU

సూపర్ స్టార్ మహేష్ బాబు మొత్తం ఆస్తుల విలువ రూ. 350 నుండి 400 కోట్ల మధ్య అంచనా వేయబడింది, ఇది సినిమాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, వ్యాపారాలు (AMB సినిమాస్ వంటివి) మరియు రియల్ ఎస్టేట్ పెట్టుబడుల ద్వారా సమకూరింది. ఆయన సంపాదనలో ముఖ్యంగా సినిమాలు మరియు వివిధ కంపెనీల యాడ్స్, అలాగే హైదరాబాద్‌లోని ఖరీదైన ఇల్లు, లగ్జరీ కార్లు ప్రధానమైనవి..

07. ALLU ARJUN

పుష్ప సినిమాతో నేషనల్ లెవల్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్..టాలీవుడ్ రిచెస్ట్ హీరోల లిస్టులో ఆరో స్థానంలో ఉన్నాడు. ఆయన నెట్‌వర్త్ సుమారు రూ.460 కోట్లు. హైదరాబాద్‌లో ‘AAA సినిమాస్’ పేరిట మల్టీప్లెక్స్, బఫెలో వైల్డ్ వింగ్స్ రెస్టారెంట్, అల్లు స్టూడియోస్ వంటి వ్యాపారాలతో బన్నీ సంపదను పెంచుకుంటున్నాడు. పుష్ప-2 సినిమా కోసం ఐకాన్ స్టార్ ఏకంగా రూ.300 కోట్ల భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని టాక్ నడుస్తోంది..

06. BALAKRISHNA

బాలకృష్ణ రూ.480 కోట్ల కంటే ఎక్కువ ఆస్తులతో లిస్టులో 5వ స్థానంలో ఉన్నాడు. హిందూపురం MLA అయిన బాలయ్య ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారం.. ఆయనకు హైదరాబాద్, AP వ్యాప్తంగా భారీగా భూములు, భవనాలు ఉన్నాయి. ఈ సీనియర్ హీరో ప్రతి సినిమాకు రూ.15 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నాడు. సినిమాలతో పాటు ఆహాలో ‘అన్‌స్టాపబుల్’ షో, ఎండార్స్‌మెంట్స్ ద్వారా కూడా డబ్బు సంపాదిస్తున్నాడు.

05. JUNIOR NTR

జూనియర్‌ ఎన్టీఆర్‌ సినిమాలే కాకుండా వ్యాపారాలు, ఆస్తుల ద్వారా ఆదాయం పొందుతున్నారు. జూనియర్‌ ఎన్టీఆర్‌కు రూ.550 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. కుటుంబం నుంచి.. సినిమాల ద్వారా అంత సంపాదన పొందారు. హైదరాబాద్‌లో ఖరీదైన భవనాలు ఉన్నాయి, శంకర్పల్లిలో ‘బృందావనం’ అనే ఫామ్‌హౌస్‌తో పాటు ఇతర ఆస్తులు కూడా ఉన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి, అతని సంపదలో ఖరీదైన కార్లు, వాచ్‌లు, ప్రైవేట్ జెట్ వంటివి కూడా..

04. RAM CHARAN

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, తన తండ్రి బాటలోనే సంపదను పెంచుకుంటూ ఈ లిస్టులో నాలుగో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం చెర్రీ ఆస్తుల విలువ సుమారు రూ.1,370 కోట్లు. ‘RRR’ సినిమాతో పాన్ ఇండియా లెవల్‌లో ఫేమస్ అయిన చరణ్, కేవలం సినిమాల ద్వారానే కాకుండా ట్రూ జెట్ ఎయిర్‌లైన్స్, అపోలో హాస్పిటల్స్‌లో భాగస్వామ్యం, సొంత ప్రొడక్షన్ హౌస్ ద్వారా భారీగా సంపాదిస్తున్నాడు..

03. CHIRANJEEVI

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ.1,600 కోట్ల నుంచి రూ.1,700 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఆయనకు జూబ్లీహిల్స్‌లో రూ.30 కోట్ల విలువైన అద్భుతమైన ప్యాలెస్ లాంటి ఇల్లు ఉంది. సినిమాలతో పాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ద్వారా చిరంజీవి భారీగా సంపాదిస్తున్నాడు..

02. VENKATESH

లిస్టులో విక్టరీ వెంకటేష్ సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. వెంకీ మామ ఆస్తుల విలువ రూ.2,000 కోట్ల కంటే ఎక్కువేనని అంచనా. వెంకటేష్ ప్రతి సినిమాకు రూ.10 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నప్పటికీ, ఆయన సంపదలో ఎక్కువ భాగం కుటుంబ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ పెట్టుబడుల నుంచే వస్తోంది. దగ్గుబాటి కుటుంబానికి చెందిన సురేష్ ప్రొడక్షన్స్ సంస్థకు వేల కోట్ల విలువైన స్టూడియోలు, థియేటర్లు, భూములు ఉన్నాయి..

01. NAGARJUNA

క్కినేని రారాజు ఇండస్ట్రీలోనే కింగ్ నాగార్జున రిచెస్ట్ హీరో. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం..టాలీవుడ్ మన్మథుడి ఆస్తుల విలువ సుమారు రూ.3,100 కోట్ల కంటే ఎక్కువ. కేవలం నటుడిగానే కాకుండా, అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా సినిమా నిర్మాణం, పోస్ట్ ప్రొడక్షన్ రంగాల్లో నాగ్ భారీగా పెట్టుబడులు పెట్టాడు. కన్వెన్షన్ సెంటర్లు, స్పోర్ట్స్ టీమ్స్‌లో వాటాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో భారీగా సంపాదించాడు.

tollywood beauty Faria Abdullah confirms dating ‘a hindu’!

happy birthday Naga Shaurya!