in

Malavika Mohanan: Producers don’t dare to back female centric films

హిళా ప్రాధాన్యమున్న చిత్రాలు వసూళ్లు సాధించలేవని పలువురు నిర్మాతలు భావిస్తున్నారని, ఈ విషయంలో వారి ఆలోచనా ధోరణి మారాలని నటి మాళవిక మోహనన్ అభిప్రాయపడ్డారు. గతేడాది విడుదలై సంచలనం సృష్టించిన చిన్న చిత్రాల్లో ‘కొత్తలోక: చాప్టర్ 1’ ఒకటి. తక్కువ వ్యయంతో రూపొందినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుని సూపర్ హిట్‌గా నిలిచింది. తాజాగా నటి మాళవిక మోహనన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహిళా ప్రధాన చిత్రాలపై నిర్మాతల దృక్పథం గురించి మాట్లాడారు..

మహిళా ప్రాధాన్యమున్న చిత్రాలకు వసూళ్లు రావనే భావన చాలా మంది నిర్మాతల్లో ఉందని, అందుకే కథానాయికలు ప్రధాన పాత్రల్లో నటించే చిత్రాలను అధిక బడ్జెట్‌తో నిర్మించడానికి ముందుకు రారని ఆమె అన్నారు. మహిళా కథలకు పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపకపోవడం వల్లనే అలాంటి సినిమాలు అరుదుగా వస్తున్నాయని మాళవిక పేర్కొన్నారు. అయితే ఈ ఆలోచనకు ‘కొత్తలోక: చాప్టర్ 1’ గట్టి సమాధానం చెప్పిందని ఆమె అన్నారు. యువ నటి ప్రధాన పాత్రలో నటించినప్పటికీ, ఆ చిత్రం రికార్డులు సృష్టించిందని, బాక్సాఫీస్ వద్ద అద్భుత వసూళ్లు సాధించిందని తెలిపారు..!!

Aishwarya Rai set to star opposite Chiranjeevi in Mega 158?

tollywood beauty Faria Abdullah confirms dating ‘a hindu’!