
మెగాస్టార్ చిరంజీవి తాజా బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న మెగా 158 సినిమాను పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించేందుకు ప్లానింగ్ జరుగుతోందని సినీ వర్గాలు అనుకుంటున్నాయి. ఈ సినిమాతో చిరంజీవిని మరోసారి పవర్‌ఫుల్ అవతార్‌లో చూపించబోతున్నారనే ప్రచారం బలంగా వినిపిస్తోంది..
ఈ సినిమా విషయంలో ఇప్పుడు ఎక్కువగా చర్చకు వస్తున్నది హీరోయిన్ ఎంపిక. చిరంజీవి సరసన మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్ నటించబోతున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో పలుమార్లు ఈ కాంబినేషన్ ప్రయత్నాలు జరిగినా వర్కౌట్ కాలేదని, కానీ ఈసారి కథ, పాత్ర బలంగా ఉండటంతో ఐశ్వర్య కూడా సానుకూలంగా స్పందించినట్టు ఇండస్ట్రీలో అనుకుంటున్నారు. ఒకవేళ ఇది నిజమైతే, ఇదే ఆమె తొలి పూర్తి స్థాయి తెలుగు సినిమా అవుతుందని టాక్..!!