in

NTR – neels’s Dragon movie Shoot Paused!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం ‘డ్రాగన్’పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కొన్ని నెలల గ్యాప్ తర్వాత ఇటీవల షూటింగ్‌ ను తిరిగి ప్రారంభించిన చిత్రబృందం, హైదరాబాద్‌లో నైట్ షెడ్యూల్‌లో జెట్ స్పీడ్‌తో షూటింగ్ నిర్వహిస్తోంది. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మలయాళ స్టార్ టోవినో థామస్, సీనియర్ నటుడు బిజూ మీనన్ కీలక పాత్రలను పోషిస్తున్నారు..

బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ ప్రాజెక్ట్‌ ను నిర్మిస్తోంది. అయితే తాజాగా షూటింగ్‌ కు స్వల్ప బ్రేక్ పడింది. గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ స్వల్ప జలుబుతో బాధపడుతున్నట్లు సమాచారం. ఆరోగ్య సమస్య పెద్దది కాకపోయినా, పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలనే ఉద్దేశంతో యూనిట్ షూటింగ్‌ ను తాత్కాలికంగా నిలిపివేసింది. ఇప్పటికే కొన్ని కారణాల వల్ల ఆలస్యమైన ఈ సినిమా షూట్‌ కు మరోసారి బ్రేక్ పడినా, ఇది కేవలం ఒకటి లేదా రెండు రోజులకు మాత్రమేనని యూనిట్ స్పష్టం చేసింది..!!

best and worst Sankranthi 2026 movies poll!

eesha rebba insulted by a director for being black!