
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ త్వరలోనే మళ్ళీ ఇంటివాడు కాబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి సోషల్ మీడియా కథనాలు. సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యతో విడిపోయిన తర్వాత సింగిల్‌గా ఉంటున్న ధనుష్, ఇప్పుడు ‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్‌తో ప్రేమలో ఉన్నారని, వీరిద్దరూ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారనే వార్త వైరల్ అవుతోంది. ధనుష్, మృణాల్ మధ్య ఏదో నడుస్తోందనే ప్రచారానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి..
బర్త్‌డే పార్టీ: ఇటీవల మృణాల్ ఠాకూర్ బర్త్‌డే వేడుకల్లో ధనుష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సన్నిహితుల మధ్య జరిగిన ఈ వేడుకలో ధనుష్ కనిపించడంతో వీరిద్దరి మధ్య స్నేహానికి మించిన బంధం ఉందనే అనుమానాలు మొదలయ్యాయి. ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయింగ్: మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం ధనుష్ సోదరీమణులు కార్తీక కృష్ణమూర్తి, విమల గీతలను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతుండటం గమనార్హం. సాధారణంగా కుటుంబ సభ్యులతో పరిచయాలు పెరిగాయంటే అది పెళ్లికి దారితీసే సంకేతమని ఫ్యాన్స్ భావిస్తున్నారు..!!
